మెగా హీరో వైష్ణవ్ తేజ్,క్రిష్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందిన సంగతి అందరికి తెలిసిందే. మొదట ఈ చిత్రాని ఓటిటి పై అమెజాన్ ప్రైమ్ లోగాని నెట్ ఫ్లిక్స్ లోగాని ఆహాలో గాని విడుదల చెయ్యాలని భావించారు. కానీ వైష్ణవ్ ఉప్పెన చిత్రంతో మంచి హిట్టు కొట్టడం. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుండటంతో క్రిష్ తన మనసు మార్చుకుని నేరుగా ఈ చిత్రాని కూడా డైరెక్ట్ గా థియేటర్స్ లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
ఈ చిత్రం యొక్క షూటింగ్ అడవి నేపథ్యంలో గిరిజనుల రైతులు తమ పొలాలకోసం పోరాటం చేసే విదంగా ఉండబోతుందని తెలుస్తుంది. “కొండపొలం” అనే నవల ఆదారంగా ఈ చిత్రాని రూపొందించినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ చిత్రం యొక్క టైటిల్ కూడా అదే పెట్టే ఆలోచనలో క్రిష్ ఉన్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయకగా నటించింది. లాక్ డౌన్ అనంతరం 45 రోజుల పాటుగా నిర్విరామంగా ఈ చిత్రం యొక్క షూటింగ్ జరిగింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
ఈ నేపథ్యంలో ఈ చిత్రం యొక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ లక్ష్మణ్ 11 కోట్లకు దక్కించుకున్నాడు. ఈ మొత్తంలో అమ్ముడు పోవడానికి ముఖ్య కారణం ఉప్పెన మూవీ పెద్ద విజయం సాదించడమే అని తెలుస్తుంది. మరి ఈ చిత్రం యొక్క రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్రిష్ పవన్ కళ్యాణ్ తో పీరియాడికల్ మూవీని రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం కోసం ఛార్మినార్ సెట్ ను, గండి కోట సంస్థనంను నిర్మించాడు.