
బిగ్ బాస్ ఫేం, 7 ఆర్ట్స్ సరయు ఓ వివాదంలో ఇరుక్కొని ఇటీవలే అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అసలు సడెన్ గా ఆమె, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ శ్రీకాంత్.. వారి ఇద్దరు అనుచరులను అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. అసలు ఎప్పుడో ఏడాది క్రితం విడుదలైన వీడియోపై ఇప్పుడు కేసు ఏంటనే అంశాలపై సరయు స్పందించింది. అసలేం జరిగిందో తెలిపింది. ఆ విషయాలేంటో ఇప్పుడు మనం చూసేద్దాం.

గతేడాది ఫిబ్రవరి 25వ తేదీన 7 ఆర్ట్స్ ఫ్రాంచైజ్ కు చెందిన ఓ హోటల్ ప్రారంభం కోసం వారు ఓ వీడియో తీశారు. సిరిసిల్లలో ఆ హోటల్ ను 26వ తేదీన ప్రారంభించాలనుకున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా వారు చేసిన వీడియోను 25వ తేదీన విడుదల చేశారు. అయితే అందులో ఓ అభ్యంతరకరమైన సన్నివేషం ఉందంటూ… సిరిసిల్ల విశ్వ హిందూ పరిషత్ వారు అభ్యంతరం వ్యక్తం చేశారట. సిరిసిల్లలో హోటల్ ఎలా ప్రారంభం అవుతుందో చూస్తామంటూ గొడవ కూడా చేశారట. దీంతో వెంటనే డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఓ వీడియోను మళ్లీ ఎడిట్ చేసి… వారికి ఇబ్బందిగా ఉన్న సన్నివేశాన్ని తీసేశారట. ఆ తర్వాత రోజు అంటే.. ఫిబ్రవరి 26న హోటల్ కూడా ప్రారంభం అయిందని సరయు తెలిపింది.

అక్కడితోనే ఈ సమస్య తీరిపోయిందనుకొని మా పనుల్లో మేమున్నాం. ఏడాది తర్వాత మళ్లీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందనే విషయం తెలిసి షాక్ అయ్యాం. అది కూడా పోస్టు ద్వారా వచ్చిన లెటర్ లో చూస్తేనే… సిరిసిల్లలో పెట్టిన కేసు బంజారాహిల్స్ కి బదిలీ అయినట్లు తెలిసిందని సరయు తెలిపింది. దీని వల్లే పోలీసులు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారని పేర్కొంది. వారికి మొత్తం విషయాన్ని వివరించినట్లు సరయు స్పష్టం చేసింది.

అయితే ఒక హిందూ కుటుంబానికి చెందిన అమ్మాయిగా తాను ఎవరి మనో భావాలను దెబ్బతీసేందుకు ఈ వీడియోలో నటించలేదని సరయు చెప్పింది. ఈ విషయంపై హర్ట్ అయిన ప్రతీ ఒక్కరికీ తను క్షమాపణలు చెప్పింది.