
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానాలు నటించిన భీమ్లా నాయక్ సూపర్ డూపర్ హిట్టయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను సంపాదిస్తున్న ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. ఒక్కో సెలబ్రిటీ ఒక్కో స్టైల్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాపై స్పందిస్తున్నారు. అయితే ఇదే సినిమాపై 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ కూడా స్పందించారు.

ఇటీవలే తాడేపల్లి గూడెంలో భీమ్లా నాయక్ సినిమాను చూశానని… హీరో పవన్ కల్యాణ్ యాక్టింగ్ ఇరగదీశారిన పృథ్వీ కామెంట్ చేశాడు. అంతే కాకుండా అప్పుడెప్పుడో సీనియర్ ఎన్టీఆర్ నటించిన అడవి రాముడు చిత్రం చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు వచ్చారట.
ఇప్పుడు కూడా అదే స్థాయిలో జనాలు రావడం చూశానంటూ పృథ్వీ రాజ్ తెలిపారు. ఈసినిమాతో పవన్ కి దిష్టి తగిలి ఉంటుందంటూ ఆసక్తిక కామెంట్లు చేశారు. 30ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి.