యాంకర్ ప్రదీప్ బుల్లితెరపై రాక్ స్టార్. టాలివుడ్ లేడి యాంకర్లలో సుమకి ఎంత క్రేజ్ ఉందో మేల్ యాంకర్లలో ప్రదీప్ కూడా అంతే ఫాలోయింగ్ ఉందనే విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఇదివరకు వెండితెరపై చిన్న చిన్న పాత్రలు పోషించిన ప్రదీప్ తన కెరీర్లో మొదటిసారి హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో ప్రదీప్ సరసన యంగ్ బ్యూటీ అమృత అయ్యర్ నటించింది. అంతేకాకుండా ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు మున్నా దర్శకత్వం వహించాడు. ప్రదీప్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులను దృష్టిలో పెట్టుకొని గీతా ఆర్ట్స్2, మూవీ క్రియేషన్స్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఓకే చెప్పాయి. మార్చి 25న ఉగాది కానుకగా ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. అదే సమయంలో కరోనావైరస్ వ్యాప్తి మొదలవడంతో అప్పటి నుంచి ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.
ఇక గత ఎనిమిది నెలలుగా కొత్త సినిమాలు కొన్ని ఓటీటీ బాట పట్టాయి. అదే సమయంలో ఈ సినిమా కూడా ఓటీటీలో విడుదలకు సిద్దం అయిందని వార్తలు వచ్చాయి. అవన్నీ అబద్దాలని ఈ సినిమా మేకర్స్ తేల్చి చెప్పారు. ఇన్నాళ్లు థియేటర్స్ కోసం ఎదురు చూసిన వీరు సంక్రాంతి బరిలోకి ఈ సినిమాను దించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే సంక్రాంతి బరిలో ఎన్నో సినిమాలు ఉండటంతో ఈ సినిమాకి సంక్రాంతి స్లాట్ కూడా దొరకడం కష్టమేనని అంటున్నారు. అంతేకాకుండా ప్రదీప్‌కు లేడీ ఫాలోయింగ్ ఉంటే ఓటీటీలో విడుదల చేస్తే సరిపోతుందని కూడా కొందరు అంటున్నారు. మరి ఫైనల్ గా ఈ సినిమా ఎప్పుడు..ఏక్కడ రిలీజ్ అవుతుందో చూడాలి.