కరోనా కారణంగా అసలు సంక్రాంతికి సినిమాలు వస్తాయా లేదా అంటూ చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. 50 శాతం ఆక్యుపెన్సీ కనుక సినిమా విడుదల విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన సోలో బ్రతుకే సోబెటర్ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసిన మేకర్స్ తమ సినిమాలను విడుదల చేసేందుకు ముందుకు వచ్చారు. అన్నట్లుగానే సంక్రాంతికి పలు సినిమాలు బాక్సాఫీస్ వద్దకు వచ్చాయి. గత ఏడాది మాదిరిగా సూపర్ స్టార్స్ సినిమాలు అయితే రాలేదు కాని ఒక మోస్తరు హీరోల సినిమాలు వచ్చాయి.
తమిళ సూపర్ స్టార్ విజయ్ మాస్టర్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డబ్బింగ్ సినిమా అయినా భారీగానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. పర్వాలేదు అనేది ఎక్కవ మంది అభిప్రాయం. ఇక మాస్టర్ సినిమా విడుదల కాకుండా సంక్రాంతి రోజున అల్లుడు అదుర్స్ మరియు రెడ్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాలు నిరాశ పర్చాయి. అభిమానుల అంచనాలను అందుకోలేక పోయాయి. జస్ట్ పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి.
సంక్రాంతిని వారం ముందే తీసుకు వచ్చిన క్రాక్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఎంటర్ టైన్‌మెంట్ పరంగా అన్ని విధాలుగా క్రాక్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాకు సంబంధించిన టాక్ చాలా పాజిటివ్ గా వచ్చింది. ప్రస్తుతం సినిమా విషయంలో అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. కనుక సంక్రాంతి విన్నర్ క్రాక్ అనడంలో సందేహం లేదు. రవితేజ చాలా కాలం తర్వాత మంచి సక్సెస్ ను దక్కించుకున్నాడు. సంక్రాంతి విజేత అవ్వడంతో పాటు తదుపరి సినిమాలపై భారీగా అంచనాలు పెరిగేలా చేశాడు అనడంలో సందేహం లేదు.