కేజీఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారిన యష్ ఆ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న కేజీఎఫ్ చాప్టర్ 2 లో నటిస్తున్నాడు. కేజీఎఫ్ విడుదలైన అన్నీ బాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ట్ ను కొట్టింది. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామిని సృష్టించింది. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు హెంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో యష్ కి జోడీగా శ్రీనిధి శెట్టి నటించింది. ఇందులో యష్ రాకీ భాయ్ గా కనిపిస్తాడు.
ప్రస్తుతం దర్శకుడు కేజీయఫ్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం యొక్క షూటింగ్ చివరి దశకు చేరుకుంది. క్లైమాక్స్ కు సంబందించిన భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్త్ ఆధీర పాత్రలో నటిస్తున్నాడు. యష్ కు ఆధీర కు మద్య వచ్చే ఫైట్ సీన్స్ కోసం నిర్మాత 12 కోట్ల వరకు ఖర్చు పెట్టడాడు అంట. ఆ లెవల్ యాక్షన్ ఎపిసోడ్ ను దర్శకుడు చిత్రీకరిస్తున్నడని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రాకీ భాయ్ రీ ఎంట్రీ కోసం దేశ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రంలో రవీనా టాండన్, రావు రమేశ్, ప్రకాష్ రాజ్, ఈశ్వరి రావు లు నటిస్తున్నారు. ప్రస్తుతం షూట్ చేస్తున్న ఫైనల్ ఎపిసోడ్ తో కేజీఎఫ్ చాప్టర్ 2 పూర్తి అవ్వుతుంది. ఈ సమ్మర్ లో అన్నీ బాషల్లోనూ ఈ చిత్రం ఒకేసారి విడుదల అవ్వనున్నది. తెలుగులో ఈ చిత్రాన్ని వారాహి ద్వారా విడుదల చేస్తారు. ఈ చిత్రం తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ చెయ్యనున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా మూవీ గా హెంబలే ఫిలిమ్స్ వారు నిర్మిస్తారు. యష్ మాత్రం తన తదుపరి సినిమా విషయంలో ఎలాంటి క్లారీటీ ఇవ్వలేదు. కేజీఎఫ్ చాప్టర్ 2 పైనే ఫోకస్డ్ గా ఉన్నాడు. త్వరలోనే తదుపరి సినిమా విషయంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.