తెలుగు ప్రముఖ దర్శకుల్లో ఒక్కరు అయిన గుణశేకర్ 2015 లో అనుష్క తో రుద్రమ దేవి చిత్రాని రూపొందించాడు. ఈ చిత్రం అయిన అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు అని చాలా సందర్భాల్లో చెప్పాడు. కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను బాగా ఆదరించారు. ఈ నేపథ్యంలో మరో పౌరాణిక ఇతిహాసం కలిసిన శాకుంతలం అనే చిత్రాని తీసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రం కాళిదాసు రాసిన అబిజ్ఞాన శాకుంతలం నుండి ప్రేరణ పొందాడు.
ఈ చిత్రంలో మొదటగా అనుష్క, పూజ హెగ్డే లు కథానాయకలుగా తీసుకోవాలని అనుకున్నాడు కానీ చివరికి అక్కినేని సమంతను ఓకే చేశాడు. ఈ విషయంను గుణ శేకర్ అధికారికంగా ప్రకటించాడు. శాకుంతలగా సమంతను తీసుకున్నాడు. మరి దుష్యంతుడు పాత్ర కోసం మలయాళ నటుడిని ఎంపిక చేసే పనిలో ఉన్నాడు. దేవి మోహన్ ని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సూఫీయుమ్ సుజాతీయుమ్ అనే చిత్రంలో నటించాడు. తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో జాతీయ అవార్డ్ గెలుచుకున్న నీతూ లూల్ల ను కాస్ట్యూమ్ డిజైనర్ గా తీసుకుంటున్నట్లు గుణశేకర్ ప్రకటించాడు.
ఈమె గతంలో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల పెళ్లికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. హృతిక్ రోశన్ నటించిన మొహెంజదారో, బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది. ప్రస్తుతం గుణ శేకర్ శాకుంతలం సినిమాకు వర్క్ చేయనున్నది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి పని చేస్తున్న ఆర్ట్ డిపార్ట్ మెంట్ సెట్లను డిజైన్ చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రం ఈ ఏడాది చివర గాని వచ్చే ఏడాది సంక్రాంతి కి గాని విడుదల చేసే అవకాశం ఉంది.