మద్యం మత్తులో ఏంచేస్తున్నారో కూడా అర్ధం కావడం లేదు. మగవారే కాదు మహిళలు సైతం ఫుల్ గా మద్యం సేవించి నడి రోడ్డు ఫై వీరంగం సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు పలు వెలుగులోకి రాగా..తాజాగా చెన్నైలో ఓ మహిళా అసెస్టెంట్ డైరెక్టర్ తప్పతాగి రోడ్డుపై రచ్చ చేయడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది.
అసిస్టెంట్ డైరెక్టర్ కామిని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన తన మిత్రుడు శేషు ప్రసాద్ తో కలిసి కారులో వెళ్తుండగా పోలీసులు ఆపారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా కారు నడుపుతున్న శేషు మోతాదుకు మించి మందు తాగినట్టు తేలింది. దీంతో, పోలీసులు వారి కారును సీజ్ చేశారు.
దీంతో, పోలీసులపై కామిని గొడవకు దిగింది. తాగితే తప్పేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులను కొట్టేందుకు కూడా వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది .