
నటి పద్మజయంతి గురించి చాలా తక్కువ మందికే తెలుసు. కానీ ఆమె చాలా చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసింది.
దాదాపుగా 400 చిత్రాలో నటించింది. తాజాగా పద్మజయంతి ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలను తెలియజేసింది. డిగ్రీ చదువుకునే వయసులో ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని అయితే తన ప్రేమ పెళ్లి తమ పెద్దలకు ఇష్టం లేకపోవడంతో ఇంట్లో నుండి బయటకు వచ్చి తన భర్తతోనే కలిసి ఉంటున్నాను అని చెప్పింది.
సినిమాలోకి రావడానికి ముఖ్యకారణం తన భర్త అని చెప్పింది. నాకు మొదటి నుండి నటన పై ఉన్న ఇంట్రెస్ట్ తోనే నన్ను ఇటువైపు ప్రోత్శహించాడు. మొదట సిరియల్స్ లలో చాలా ముఖ్యమైన మరియు కీలకమైన పాత్రలు వచ్చాయి. ఆ తర్వాత సినిమాలో ఛాన్స్ లు రావడంతో లైఫ్ హ్యాపీ గా గడిచిపోయింది. సిరియల్స్ మరియు సినిమాలు కలిపి 400 చిత్రాలకు పైగా నటించాను. కానీ సొంతంగా ఇల్లు మాత్రం కొనలేకపోయాను అంది. అద్దె ఇంట్లోనే ఉంటున్నాము అంది.
మొదట సినిమా కెరీర్ లో చాలా మంచి సినిమాలు వచ్చాయి. కానీ ఓ నటుడు వలన నటిగా సరైన గుర్తింపు రాలేదు అంది. అతను నన్ను ఎదగనివ్వకుండా పెద్ద సినిమాల్లో అవకాశాలు రాకుండా చేశాడు. అందుకే నేను నాకు వచ్చిన సినిమాలు మాత్రమే చేశాను. అల అతని వలన నా కెరీర్ దెబ్బతిన్నది అంది. మనం సినిమాలో రాణించాలి అంటే మనకు సంబందించిన వ్యక్తులు ఎవరైనా ఉండాలి లేకపోతే డబ్బులు అయిన ఉండాలి లేకపోతే ఇక్కడ రాణించలేము అంది. ప్రస్తుతం తెలుగులో కొన్ని సిరియల్స్ లలో నటిస్తున్నాను అని చెప్పింది.