సీనియర్ నటుడు మోహన్ బాబు మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఇప్పటి వరకు ఈయన ఎన్నో విషయాల్లో కాంట్రవర్సీలు జరుగుతూనే వచ్చాయి. అయితే తాజాగా మరో కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. ఆయనతో పాటు అతని కొడుకు మంచు విష్ణు కూడా ఈ వివాదంలో ఉన్నాడు. విష్ణు కార్యాలయంలో జరిగిన హెయిర్ డ్రెస్సర్ వివాదం రోజురోజుకీ ముదురుతోంది. నాయి బ్రాహ్మణులను కించ పరిచేలా హీరో మోహన్ బాబు మాట్లాడారంటూ ఆ సంఘం నాయకులు హెచ్చార్సీని ఆశ్రయించారు.
హైదరాబాద్ లోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు వెళ్లి మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణుపై ఫిర్యాదు నిచ్చారు. ఇప్పట్లో ఈ వివాదం తగ్గేలా కనిపించడం లేదు. ఇందులో భాగంగానే మెగా బ్రదర్ నాగ బాబు నాగ శ్రీను ఇంటికి వెళ్లి డబ్బులు ఇచ్చారు. ఆయన అలా చేయడంతో ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు హెచ్చార్సీకి ఫిర్యాదు చేశారు.
తమ కులాన్నిదారుణంగా కించపరిచారని కచ్చితంగా క్షమాపమ చెప్పాల్సిందేనంటూ ఫిర్యాదు చేశారు. అయితే రెండ్రోజులు గడువు ఇచ్చినా మోహన్ బాబు కానీ, మంచు విష్ణు కానీ ఇప్పటి వరకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా తమ కులాలపై దాడి మాత్రం ఆగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే నాగ శ్రీనుపై తప్పు డు కేసులు పెట్టించారని… ఇప్పటికైనా అతడికి న్యాయం చేయాలని కోరారు.