
తెలుగు సీనియర్ ఆర్టిస్ట్ లలో పద్మ జయతి ఒక్కరు. అక్క, చెల్లి, వదిన, తల్లి పాత్రలు చేసి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. తెలుగులో దాదాపుగా ఆమె చాలా చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలుగు సినిమా ఇండస్ష్ట్రి కి సంబందించిన చాలా విషయాలను తెలియజేసింది. ఆమె సినిమాలోకి రావడానికి పడిన బాదలు, తనతో ఎవరు ఎలా ప్రవర్తించారు. తన ఫ్యామిలీ మరియు పర్శనల్ విషయాలను కూడా తెలియజేసింది.
అలాగే సీనియర్ నటుడు ఎంఎస్ నారాయణ ప్రవర్తనపై పద్మ జయంతి హాట్ కామెంట్స్ చేసింది. ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో నటి పద్మ జయంతి “నాది లవ్ మ్యారేజ్ 18 వ ఏటనే ప్రేమించి పెళ్లి చేసుకున్నా… నేను సినిమాలోకి రావడానికి ముఖ్య కారణం మా ఆయన. తను కష్టకాలంలో కూడా నా వెంట ఉండి నన్ను ముందుకు నడిపించాడు అని అన్నారు. అలాగే ఎంఎస్ నారాయనతో జరిగిన ఓ సంఘటన ను కూడా షేర్ చేసుకున్నారు.
“ఓ 20 మంది టాప్ మోస్ట్ కామిడియన్స్ తో ఓ సినిమాను లో ఓ సన్నివేశాన్ని షూట్ చేస్తున్నారు. అప్పటికే మా అత్తగారు చనిపోయి నెల రోజులు కావస్తుంది. నేను ఆ బాదతో అక్కడే కూర్చొని ఉన్న. సడన్ గా నా వెనకాల ఓ వ్యక్తి వచ్చి నా చేయి పట్టుకొని లాక్కుపోతున్నాడు. నేను ఎవరా ఆ వ్యక్తి అని చూస్తే స్వర్గీయ ఎంఎస్ నారాయణ గారు. ఏంటి ఎక్కడికి లాక్కుపోతున్నారు అంటే… ఆయన బాషలో ఎహే రాయే నీతో పని ఉంది అంటు మాట్లాడుతున్నాడు. అప్పటికే ఆయన తాగేసి ఉన్నాడు. ఆయన మాటలు బట్టి చూస్తే నాకు అసలు విషయం అర్థం అయింది.
నేను వెంటనే ఆయన నుండి చెయ్యి విడిపించుకున్నాను. నిజానికి ఆయన నాలో సగం ఉంటాడు. ఏంటి ఎక్కడికి చెయ్యి పట్టుకొని లాక్కుపోతున్నావు అంటే.. అప్పుడు ఎంఎస్ నువ్వు చాలా సెక్సీ గా అందంగా ఉంటావు అంటు ఆయన నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు… నాకు ఈ రోజు షూటింగ్ చేసే మూడ్ లేదు రాయే అంటు మాట్లాడుతున్నాడు. నేను ఇంటికి వెళ్ళండి మూడ్ వస్తుంది అని అన్నాను. అయిన ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదు.
ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంటే నేను ఆయన గోతు పట్టుకొని గొడవద్దుకు లాకెళ్లాను. ఆయన గట్టి గట్టిగా కేకలు వెయ్యడం మొదలు పెట్టాడు. అప్పుడు అక్కడ ఉన్న జనం అంత వచ్చి నాకు సర్ది చెప్పుతున్నారు తప్ప ఎంఎస్ గారిని మాత్రం ఏమి అనడం లేదు. ఆ తర్వాత నేను మూవీ అసోషియేషన్ లో కంప్లెంట్ ఇచ్చాను. నాకు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ చేసి నన్ను బెదిరించారు నువ్వు చాలా పెద్ద కొండను ఢీ కొంటున్నావు అది నీకే మంచిది కాదు అంటు బెదిరించారు. కాని వాళ్ళ బెదిరింపులకు నేను బయపడలేదు.
నేను పడిన సినిమా కష్టాల్లో ఇది ఎంత అనుకున్న. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నన్ను తీసేశారు. అయిన నాకు ఉన్న సినిమాలతో నేను నటించాను అని పద్మ జయంతి అన్నారు.