
నేటి జెనరేషన్ ప్రేక్షకులకు నటి పద్మజయంతి గురించి చాలా తక్కువ తెలుసు. ఆమె దాదాపుగా 350 కి పైగా చిత్రాల్లో నటించింది. ఆ మధ్య తెలుగు సినిమా ఇండస్ష్ట్రి లోని క్యాస్టింగ్ కౌచ్ పై వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. బుల్లి తెరపై నటిగా మెప్పించి ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేసింది. మొదట్లో ఆమె ఇండస్ష్ట్రి లోకి రావడానికి చాలా కష్టాలు పడింది.
నటి పద్మజయంతి తన జీవితంలోని కొన్ని బాదకర సంఘటనలను మరియు తన ఫ్యామిలీ విషయాలను ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ప్రేక్షకులతో పంచుకుంది. “నాది లవ్ మ్యారేజ్ కాలేజీ రోజుల్లోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఆ టైమ్ లో నాకు ఫ్యామిలీ సఫోర్ట్ లేదు. మా ఆయనే నన్ను ఎంఏ లిటరేచర్ వరకు చదివించాడు. నటనపై నాకు ఉన్న ఇంట్రెస్ట్ ను గమనించి మా ఆయన నన్ను సినిమా వైపుకు ప్రోత్సహించాడు.
]నేను ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉండటానికి కారణం మా ఆయనే… నేను ప్రేమ వివాహం చేసుకోవడం నా తల్లితండ్రులకు ఇష్టం లేదు. ఆస్తులకోసం మా అన్న మా అమ్మ నాన్న కు విషం ఇచ్చి చంపేశాడు. మా అమ్మ నాన్నలకు పట్టిన గతి నాకు కూడా పడుతుందన్నా భయంతో మా అన్న గుట్టు సప్పుడు కాకుండా బ్రతుకుతున్నాడు. నేను ఎక్కడైనా ఎదురుపడిన నన్ను ఫేస్ చేసే ధైర్యం లేక తల వంచుకొని వెళ్తాడు.
ఆస్తిలో నేను ఎక్కడ వాటా అడుగుతానో అన్న భయం తో కనీసం మా వైపుకుడా చూడడు” అని అంది. నా వాళ్ళు నన్ను వదిలేసిన మా ఆయన నన్ను చాలా బాగా చూసుకున్నాడని భర్తపై ఉన్న ప్రేమను చెప్పకనే చెప్పింది నటి పద్మ జయంతి.